పట్టుదల, నైపుణ్యం, ఐక్యతతో జట్టు సభ్యులు సాధన చేసినప్పడే... క్రీడల్లో విజయం సాధిస్తారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లలో... శ్రీ లక్ష్మీ గణపత్రి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల బహుమతుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు నిర్వాహకులను మంత్రి అభినందించారు.
భవిష్యతును దృష్టిలో ఉంచుకొని అన్ని రంగాల్లో రాణించేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. ఈ ప్రాంతంలో అంతరించిపోతున్న వ్యవసాయానికి కాళేశ్వరం జలాలు ఊపిరి పోస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిరిసిల్ల జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, సర్పంచి తీగల మోహన్ రెడ్డి, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: శ్రీదేవసేన ప్రశ్న.. చేతుల్లేపేందుకు మొగోళ్ల డౌటనుమానం.!