కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నియంత్రిత వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కరోనా అరికట్టాలంటే కేవలం ప్రభుత్వాతోనే సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్, జడ్పీ ఛైర్‌పర్సన్ విజయ, ఐడీసీ ఛైర్మన్ శంకర్‌రెడ్డి, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'