కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ శశాంక ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. నాటిన మొక్కలు అన్నింటికీ కర్రలు, ట్రీగార్డులు కట్టారు. ఐదు పట్టణాలు, 313 గ్రామపంచాయతీల్లో 55 లక్షల మొక్కలు పంపిణీకి అధికారులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
15 లక్షల మొక్కలు విస్తృతంగా నాటేందుకు, మిగిలినవి ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నట్లు శశాంక వివరించారు. వాతావరణ సమతుల్యత సాధించే దిశగా నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు , కర్రలతో రక్షణ కల్పించాలన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాక.. వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు.