హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సీఐ వాసంశెట్టి మాధవి అన్నారు. తుమ్మనపల్లిలోని ఏకశిల సీబీఎస్ఈ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. వాటికి నీళ్లు పోసి.. విద్యార్థులు నాటిన మొక్కలకు సంరక్షణ బాధ్యత చేపట్టాలని సూచించారు. మొత్తం పాఠశాల ఆవరణలో 200 మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎస్సై అనూష, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః ఆన్లైన్లో సినిమా టికెట్లకు చెల్లుచీటి...: మంత్రి తలసాని