కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు.
అనంతరం స్వామి వారికి జలక్రీడ నిర్వహించి, పంచామృతాలతో అభిషేకం చేశారు. 18 మెట్లపై కర్పూర దీపాలు వెలిగించి పడి పూజ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చూడండి : అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్ రావు