అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ చావే శరణ్యం అంటూ కాల్వలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటుచేసుకుంది. అక్కడే ఉన్న జాలర్లు బాధిత మహిళను కాపాడి పోలీసులకు సమాచారం అందించగా వారు ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలి వద్ద లభ్యమైన ఆధారాలతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కరీంనగర్ హుస్సేనిపురాకు చెందిన తిప్పర్తిని శారద, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. కొద్దిరోజులుగా దగ్గితే రక్తం పడుతోందని.. అందుకే ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె భర్త శ్రీనివాస్ పేర్కొన్నారు.