వరంగల్ అర్బన్ జిల్లా గుండేడులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ శివారులోని గుండ్ల చెరువులో కరీంనగర్ జిల్లా కనగర్తికి చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న గుండేడు గ్రామంలోని మత్స్యకారులు చెరువు వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రహదారిపై పెద్ద దుంగలను ఉంచి... గుండేడు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కమలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా మత్స్యకారులు నినాదాలు చేశారు. గొడవ జరుగుతుందని అటుగా వచ్చిన తనపైనా... దాడి చేశారని స్థానికుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.