కరీంనగర్ గ్రామీణం, కొత్తపల్లి మండల పరిషత్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు అందరి సహకారంతో గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ప్రత్యేక అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి ఎంపీటీసీలతో పాటు తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'వరంగల్ కామాంధుడిని ఉరితీయాలి'