స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో కరీంనగర్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 72వ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించిన సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతిలకు మిఠాయిలు తినిపించారు.
లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న కేటగిరీలో కరీంనగర్ నగరం దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పని తీరుకు నిదర్శనమే ఈ ర్యాంకు అని గంగుల పేర్కొన్నారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌కు రూ. 100 కోట్లు కేటాయిస్తుండగా.. నగరంలోని రోడ్లు, మురికి కాలువలతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడిందని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్ర జల్ శక్తి మంత్రికి కరోనా పాజిటివ్