Satavahana University: కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఆవరణలో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం ఎండతీవ్రతకు మంటలు వేగంగా వ్యాపించాయి దీంతో చాలా చెట్లు, మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే గతంలో కూడా వేసవిలో మంటలు చెలరేగడం గమనార్హం.
భయాందోళనలో విద్యార్థులు
భయాందోళనకు గురైన విద్యార్థులు కళాశాల బయటికి వచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలు అదుపులోకి రావడంతో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రతి వేసవిలో ఇక్కడ మంటలు చెలరేగడం సాధారణంగా మారింది. అకస్మాత్తుగా చెలరేగుతున్న ఈ మంటలతో వన్యప్రాణులకు ప్రమాదం పొంచి ఉందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: