కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు ట్రస్మా ఆధ్వర్యంలో అవార్డులు అందించారు. ఉత్తమ ఉపాధ్యాయులను కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ శాలువాలతో సత్కరించి మెమొంటోలను అందించారు.
కొవిడ్-19 సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులు సమస్యలను ఎదుర్కొంటున్న మాట వాస్తవమని ఆయన అన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఇదీ చదవండి: వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన