ETV Bharat / state

చేతులతో.. కూతురి శవాన్ని మోసుకెళ్లిన తండ్రి - daughter

కళ్ల ముందు కన్న కూతురు కనుమూసింది. ఓ వైపు గుండె లోతుల్లో నుంచి పొంగుకొస్తున్న కన్నీరు. బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. అంబులెన్సు ఏర్పాటు చేయమని అధికారులను బతిమిలాడితే ప్రయోజనం లేకపోగా... వారి మాటలు ఓ పేద తండ్రిని మరింత కుంగదీశాయి.

కూతురి శవాన్ని మోసుకెళ్లిన తండ్రి
author img

By

Published : Sep 2, 2019, 7:30 PM IST

అధికారుల నిర్లక్ష్యపు సమాధానం... ఓ పేద తండ్రి కన్న కూతురు శవాన్ని చేతులతో మోసుకువెళ్లేలా చేసింది. డబ్బులు లేవని ఎంత బతిమిలాడినా.. సిబ్బంది కనికరించకపోవడం వల్ల బోరున ఏడుస్తూ.. ఆటోస్టాండ్ వరకు తీసుకెళ్లాడు. ఏడేళ్లు కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు మరణం తండ్రికి తీరని శోకాన్ని మిగిలిస్తే... అధికారుల నిర్లక్ష్యపు మాటలు అతడిని మరింతగా కుంగదీశాయి.

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారానికి చెందిన సంపత్‍.. కూతురు కోమలత కొన్నాళ్లుగా ‘లివర్‍’ వ్యాధితో బాధపడుతోంది. కూతురును ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించే స్తోమత లేక కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించాడు. కోమలత ఆరోగ్యం విషమించి ఆదివారం మరణించింది.

చేతులపై... కూతురు శవం

సంపత్​ చేతిలో చిల్లగవ్వ కూడా లేకపోవడం వల్ల ప్రభుత్వ అంబులెన్స్​ ఏర్పాటు చేయాలని అధికారులను కోరాడు. అవి పని చేయడం లేదనే నిర్లక్ష్యపు సమాధానం అధికారులు నుంచి వచ్చింది. చేసేది ఏమీలేక స్టెచర్‌పై హాస్పిటల్ బయటకు కూతురి శవాన్ని తీసుకువచ్చాడు. అక్కడి నుంచి ఆటోస్టాండ్ వరకు ఏడ్చుకుంటూ చేతులపై తీసుకెళ్లాడు.

ఆటోడ్రైవర్ మానవత్వం..

బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లాలంటూ.. చేతుల్లో పెట్టుకొని తమ ఆటో డ్రైవర్లను బతిమిలాడాడు. ఓ ఆటోడ్రైవర్ తన మానవత్వాన్ని చాటుకుని తన ఆటోలో వారిని గ్రామానికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడం బాధాకరమని.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించి అంబులెన్స్​ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.