కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేటలో మండల వ్యవసాయ అధికారిణి కిరణ్మయి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కజొన్న, పత్తి పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. కత్తెర పురుగుతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెగుళ్ల నివారణకు ఉపయోగించే బయో, రసాయన ఎరువులు వాడే పద్ధతిని క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులతో కలిసి పంట చేలను పరిశీలించారు.
ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!