Electric Bike Explosion : ఛార్జింగ్‌కు పెట్టిన విద్యుత్తు ద్విచక్ర వాహనంలోని బ్యాటరీ పేలిపోయిన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. రామచంద్రాపూర్‌కు చెందిన ఎగుర్ల ఓదేలు తన ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయారు. అర్ధరాత్రి బ్యాటరీ పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. నిద్రిస్తున్న వారంతా అప్రమత్తమై మంటలను అదుపు చేశారు.
- 'నిన్ననే కొన్నారు.. ఇవాళ పేలింది.. ఒకరు చనిపోయారు'
- ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి.. ఎక్కడో కాదు మన దగ్గరే.!
- ఛార్జింగ్ చేస్తుండగా మంటలు.. ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం
పదకొండు నెలల కిందట కొనుగోలు చేసిన బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నిత్యం ఉపయోగిస్తున్నామని, మరో నెల పాటు వారంటీ ఉందని బాధితుడు తెలిపారు. సంబంధిత కంపెనీ యాజమాన్యం బాధితునికి కొత్త వాహనాన్ని అందజేసింది.