కేంద్ర ఎన్నికల సంఘం పేరిట నకిలీ ఆర్టీఐ సమాచారాన్ని సృష్టించిన వ్యవహారంలో ఈసీ చర్యలకు ఉపక్రమించారు. దళితబంధు నిలిపివేతకు సంబంధించి తమ పేరిట వచ్చిన ఆర్టీఐ సమాచారం నకిలీదని స్పష్టం చేసిన ఈసీ... ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ మెమో జారీ చేశారు. డీజీపీ, కరీంనగర్ కలెక్టర్, కరీంనగర్ సీపీ, హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారికి సీఈఓ ఆదేశాలు ఇచ్చారు. నకిలీ ఆర్టీఐ వ్యవహారంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని... ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: