ETV Bharat / state

కౌశిక్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు - నివేదిక కోరిన సీఈసీ - కేసు నమోదు చేసిన కమలాపూర్ పోలీసులు

EC On Kaushik Reddy Comments : బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఆదేశించింది. 'ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను అభ్యర్థించిన విషయం తెలిసిందే. మరోవైపు కౌశిక్ వ్యాఖ్యలపై ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana Assembly Elections 2023
EC On Padi Kaushik Reddy Comments
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 11:50 AM IST

Updated : Nov 29, 2023, 1:12 PM IST

EC On Kaushik Reddy Comments : తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై అక్కడి ప్రజలు నివ్వెరపోయారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఆదేశించింది.

మంగళవారం రోజున జరిగిన ప్రచారంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్ర యాత్రతో వస్తా.. ఓడితే నా శవయాత్రకు మీరు రావాల్సి ఉంటుంది. నేను ఓడిపోతే భార్యా బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంటా. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదకరంగా ఉండటంతో పాటు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నివేదిక కోరింది. వీలైనంత త్వరగా ఆ విచారణ నివేదిక అందించాలని సూచించింది.

మరోవైపు కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పోలీసులు కౌశిక్​పై కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎంపీడీవో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రచారంలో మంగళవారం రోజున భావోద్వేగ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

'నియమాలు ఉల్లంఘించారు' - రైతుబంధుకు సీఈసీ అనుమతి ఉపసంహణ

నిఘా నీడలో తెలంగాణ - శాసనసభ పోలింగ్​కు పకడ్బందీ గస్తీ

Last Updated : Nov 29, 2023, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.