ETV Bharat / state

కరీంనగర్​లో ఘనంగా దసరా వేడుకలు

విజయదశమి పర్వదినాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. నవరాత్రి వేడుకల శోభతో నగరం అలరారింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రావణుడి బొమ్మను దహనం చేశారు.

dussehra celebrations in karimnagar
కరీంనగర్​లో ఘనంగా దసరా వేడుకలు... రావణ దహనం
author img

By

Published : Oct 26, 2020, 9:34 AM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్​లోని అంబేడ్కర్ స్టేడియంలో రావణదహనం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్​ శశాంక, సీపీ కమలాసన్​రెడ్డి పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికైన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 30 అడుగుల రావణుడి బొమ్మను దహనం చేశారు.

మరింత వినోదం

కరీంనగర్​లో ప్రతి ఆదివారం ఆహ్లాదాన్ని పంచే విధంగా వినోదాత్మక కార్యక్రమాలను నగరంలో ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం చేపట్టనున్నట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు.

కరీంనగర్​లో ఘనంగా దసరా వేడుకలు... రావణ దహనం

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా దసరా సంబరం, రావణ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.