కరీంనగర్ జిల్లా వెదిరలో డీఆర్డీవో పీడీ శ్రీలత రెడ్డి పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలకు సకాలంలో డబ్బుల చెల్లింపు చేస్తున్నారో లేదో వాకబు చేశారు. జాబ్ కార్డు కలిగిన వారంతా ఉపాధి పనులు చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ విధించినా ఉపాధి హామీ పథకం పనులను ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.
రోజుకు రూ.190 చెల్లింపునకు నిర్ణీత కొలతల ప్రకారం చేపట్టాలన్నారు. దీనికి ప్రభుత్వం అదనంగా 55 రూపాయలు చెల్లిస్తుందన్నారు. గ్రామాల్లో కొత్తగా కూలీల నమోదు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ చూడండి: స్థిరాస్తి రంగంపై రెండో దశ కరోనా ప్రభావం