ధాన్యం కొనుగోలు గురించి దిగులుపడాల్సిన అవసరం లేదని రైతులకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. పండించిన ప్రతీ పంట కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో వరి పంట కొనుగోలులో సమస్యలు, ఇతర విషయాలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి చర్చించారు.
కొనుగోళ్లలో రైతులకు ఎప్పటికప్పుడు త్వరితగతిన చెల్లింపులు చేస్తామని చెప్పారు. కొనుగోలు సందర్భంగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇందుకు రైస్ మిల్లర్లు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దొడ్డిదారిలో సరఫరా చేయకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఇక ఉల్లి కిలో 40రూపాయలకే!