కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి భర్తపై తెరాస నేతల దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. దాడిలో గాయపడి సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆనంద్‌ను ఎంపీ సంజయ్ పరామర్శించారు.
దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని.. అండగా ఉంటామని ఎంపీ భరోసా ఇచ్చారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా.. తెరాస నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.