గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లోని బాలసదన్‌ను జిల్లా కలెక్టర్ శశాంక.. పోలీస్, నగరపాలక సంస్థ కమిషనర్లు వీవీ కమలాసన్ రెడ్డి, క్రాంతి సందర్శించారు. అనాధ చిన్నారులతో కొద్దిసేపు సరదాగా గడిపారు.
చిన్నారులకు మిఠాయిలు, పండ్లను పంచిపెట్టారు. అనాధలను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ తెలిపారు. బాలసదన్‌లో అన్ని రకాల వసతులు కల్పించామని పేర్కొన్నారు.
వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అధికారులు బాలసదన్ సందర్శించడంతో చిన్నారులు ఆనందంలో మునిగిపోయారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: అంబేడ్కర్ వల్లే అట్టడుగు వర్గాలు చట్ట సభల్లో..: మంత్రి హరీశ్