కరీంనగర్ వాసులకు భవన నిర్మాణ పనుల కోసం ఆన్లైన్ ద్వారానే ఇసుక పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, రెవెన్యూ, పోలిస్, మైనింగ్ అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక నుంచి మన ఇసుక”యాప్ ద్వారా పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 10 ఇసుక రీచ్‌లు ఉన్నాయని.. ప్రతి మండలానికి అందుబాటులో మరికొన్ని రీచ్‌లను గుర్తించామని తెలిపారు.
ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. రీచ్‌ల వద్ద సరఫరా కోసం ట్రాక్టర్లను రిజిస్ట్రేషన్ చేయించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ట్రాక్టర్ల డ్రైవర్లకు లైసెన్స్‌లు ఉండాలని, ట్రాక్టర్లకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు ఉండాలని సూచించారు. ఇసుక కోసం ప్రజలు మీ సేవ కేంద్రాలలో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇసుక పెనాల్టీ కింద 2019-20 సంవత్సరంలో 362 కేసులకు రూ. 22 లక్షల 95 వేల 700, 2020-21 సంవత్సరానికి గాను 63 కేసులకు 3 లక్షల 90 వేల రూపాయలను ఇసుక పెనాల్టీ కింద వసూలు చేయడమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన