రాష్ట్రంలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు లాక్డౌన్ నిబంధనల మేరకు కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. స్వామి వారికి అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అర్చకులు నిత్య పూజలు, కార్యక్రమాలు అంతరంగికంగా నిర్వహిస్తారు.
అభిషేకం, స్వామి వారి కల్యాణం కోసం భక్తులు ఆన్లైన్లో రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పూజలు నిర్వహించి ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా అందిస్తామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: 5 ట్యాంకర్లతో రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ రైలు