కరీంనగర్లోని శ్రీ మహా శక్తి ఆలయంలో దేవీ నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాలతో ఆలయ పరిసర ప్రాంతాలను అందంగా అలంకరించారు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. 108 రకాల మూలికలతో అమ్మవారికి నివేదన చేశారు.
దాండియా ఆటలు
ఆలయం ఆవరణలో దాండియా ఆటలు ఆడేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. కాలనీవాసులు ప్రతి రోజు దాండియా ఆటలు ఆడే ముందు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు.
ఇదీ చదవండి: దేశంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు