ETV Bharat / state

అకాల వర్షంతో అన్నదాతలకు అపార నష్టం - కరీంనగర్​లో నీటిపాలైన ధాన్యం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా అకాల వర్షానికి తడిసిముద్దయింది.  మార్కెట్​కు తీసుకువచ్చిన ధాన్యం సరైన సదుపాయాల్లేక నీటి పాలైంది.

కరీంనగర్​లో నీట మునిగిన ధాన్యం
author img

By

Published : Oct 25, 2019, 12:17 PM IST

కరీంనగర్​ జిల్లా గంగాధరలో భారీ వర్షం రైతులను నట్టేట ముంచింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులు మార్కెట్​కు తీసుకొచ్చారు. సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల తమ ధాన్యాన్ని యార్డుల్లోని ప్లాట్​ఫామ్​లపై కుప్పలుగా పోశారు. అరకొరగా ఉన్న టార్పాలిన్లు కప్పారు. గంట సేపు కురిసిన వానను టార్పాలిన్లు అడ్డుకోలేక పోయాయి. ధాన్యం మొత్తం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంటంతా కళ్లముందే నీటిపాలైందని రైతులు లబోదిబోమన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.