Crop Damage in Karimnagar District: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరసగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులు.. పెద్దఎత్తునే నష్టం మిగిల్చాయి. వ్యవసాయ అధికారులు తేల్చిన ప్రాథమిక అంచనా ప్రకారం అన్ని పంటలు కలిపి 66 వేల 987 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. రామడుగు, సైదాపూర్, చొప్పదండి తదితర మండలాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టం వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
ఆకాల వర్షం.. భారీగా నష్టం: తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడత పంట నష్టంగా జిల్లాకు రూ.8.16 కోట్ల విడుదల అయ్యాయని.. త్వరలోనే రైతులకు అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈసారి పంట నష్టపోయిన వారిలో అధిక శాతం కౌలు రైతులే ఉన్నారు. ఈదురుగాలుల కారణంగా జగిత్యాల జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లాలోనూ.. భారీగానే పంట నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలో మామిడి తోటలకు ఎనలేని నష్టం వాటిల్లింది. కోత దశకు ఉన్న మామిడిని ఈదురుగాలులు నేల రాల్చాయని రైతులు కంటతడి పెడుతున్నారు.
పరిహారం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: పెద్దపల్లి జిల్లాలో 14 వేల 620 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వడగండ్ల వాన, ఈదురు గాలులతో జిల్లా వ్యాప్తంగా 82 విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. కమలాపూర్ మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు, ఇళ్లకు పరిహారం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈటల తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను నానాగోస పెడుతున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
Crop Loss in 67 Thousand Acres of Karimnagar District: కరీంనగర్ జిల్లా ఫకీర్‌పేట, చామన పల్లి, వెదురుగట్ట తదితర గ్రామాల్లో వడగళ్లతో పంటలు దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభిస్తే రైతులకు నష్టం సగానికి సగం తగ్గేదని విమర్శించారు. చేతికొచ్చిన పంట.. నోటి కాడికి అందే లోపులోనే అకాల వర్షానికి దెబ్బతినడంతో.. అన్నదాతలు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: