ETV Bharat / state

గచ్చిబౌలి ఆస్పత్రిలో చికిత్స ఎందుకు చేయట్లేదు: చాడ - CPI State Secretary chada venkat reddy latest news

కరోనా వైరస్​ బారిన పడిన బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి మండిపడ్డారు. గచ్చిబౌలిలోని కొవిడ్ ఆస్పత్రిలో చికిత్సలు ఎందుకు చేయటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

CPI State Secretary chada venkat reddy fires on govt
గచ్చిబౌలి ఆస్పత్రిలో చికిత్స ఎందుకు చేయట్లేదు: చాడ
author img

By

Published : Jun 18, 2020, 7:34 PM IST

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసి.. బాధితులను గాలికొదిలేశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి విమర్శించారు. కరీంనగర్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత నెలకొందని చాడ పేర్కొన్నారు. 50 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు పలువురు పోలీసులు, జర్నలిస్టులు వైరస్ బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో కొవిడ్​-19 ఆస్పత్రిని అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం.. అక్కడ ఎందుకు చికిత్సలు చేయడం లేదని ప్రశ్నించారు.

విద్యుత్​ బిల్లుల వసూలు వాయిదా వేయాలి...

పెట్రోల్, డీజిల్ ధరలు ఈ నెలలో 8 సార్లు పెరిగాయని చాడ గుర్తుచేశారు. ఈ పెంపును నిరసిస్తూ ఈనెల 20న దేశ వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో పాల్గొంటామని తెలిపారు. లాక్​డౌన్​ నేపథ్యంలో 3 నెలల విద్యుత్​ బిల్లులు ఒకేసారి వసూలు చేయటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ బిల్లుల వసూలును వాయిదా వేయాలని కోరారు.

రైతుబంధు సొమ్ము అందరికీ ఇవ్వాలి..

నియంత్రిత సాగు పేరిట రైతులపై ఆంక్షలు వద్దన్న ఆయన.. రైతుబంధు సొమ్ము అందరికీ ఇవ్వాలన్నారు. ఉద్యోగుల వేతన కోతకు తెచ్చిన ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గాల్వన్​ ఘటనలో అమరులైన జవాన్​లకు పార్టీ తరఫున శ్రద్ధాంజలి ప్రకటించారు.

ఇదీచూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.