కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. పట్టణంలో ఎడ్ల బండిని నడుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల సాకు చూపుతున్నారని ధ్వజమెత్తారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. సామాన్యులు, చిరువ్యాపారులపై పెరుగుతున్న ధరలు భారంగా మారాయన్నారు. భవిష్యత్తులో ఎడ్ల బళ్లు, సైకిళ్లపై ప్రయాణం చేసే పరిస్థితి రానుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా