ETV Bharat / state

పల్లెవిస్తున్న టీకాస్త్రం...వ్యాక్సినేషన్‌లో గ్రామీణుల స్ఫూర్తి

పల్లెల్లో టీకాలపై ఉన్న అపోహలు వదిలి ప్రజలు ముందుకొస్తున్నారు. మొదట వ్యాక్సిన్​ తీసుకోవాలంటేనే భయపడేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది చొరవతో గ్రామీణులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 45 పైబడిన వారికి టీకాలపై అవగాహన కల్పించడం చాలా వరకు సత్ఫలితాలిస్తోంది.

covid vaccination improved in villages across the state
పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో టీకాల కోసం వచ్చిన ప్రజలు
author img

By

Published : Apr 29, 2021, 7:50 AM IST

పల్లెలు కరోనాపై పోరుకు టీకాస్త్రాన్ని సంధిస్తున్నాయి. వైరస్‌ రూపంలో ఎదురొచ్చిన కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాయి. గడిచిన వారం రోజుల్లో గ్రామాల్లో టీకాల కార్యక్రమం జోరందుకుంది. ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది కృషి ఫలిస్తోంది. కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఇప్పటివరకు 5.10 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకుని స్ఫూర్తి చాటారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాలలో ఒకేరోజు 45 ఏళ్లు పైబడిన 718 మందికి టీకాలు వేశారు. గర్షకుర్తిలో 761 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

సర్పంచ్ స్వయంగా ట్రాక్టర్ సమకూర్చి...

గోపాల్‌రావుపల్లె అనే చిన్నపల్లెలో అర్హులందరూ టీకా తీసుకునేలా ఆ ఊరి సర్పంచి చొరవ చూపించారు. పల్లె నుంచి గంగాధరలోని పీహెచ్‌సీకి వెళ్లేందుకు ట్రాక్టర్‌ సమకూర్చి 65 మందికి టీకా వేయించారు. పెద్దపల్లి జిల్లా రత్నాపూర్‌ గ్రామం 80 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా 100కిపైగా గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

15 జిల్లాల్లో లక్ష మందికి పైగా..

హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల తరువాత సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లోని గ్రామీణ ప్రజలు టీకాపై అత్యధిక ఆసక్తి కనబరుస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 1,98,370 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కరీంనగర్‌ (1,93,011 మంది), యాదాద్రి- భువనగిరి (1,62,712), నిజామాబాద్‌ (1,50,621), కామారెడ్డి (1,47,037), సంగారెడ్డి (1,24,243), జగిత్యాల (1,22,573), నిర్మల్‌ (1,20,135), ఖమ్మం (1,20,085), భద్రాద్రి- కొత్తగూడెం (1,15,285), సూర్యాపేట (1,15,736), నల్గొండ (1,06,594) జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఎక్కువగా పట్టణాలున్న హైదరాబాద్‌ (7,36,612), మేడ్చల్‌- మల్కాజిగిరి (4,07,480), రంగారెడ్డి (3,81,934) జిల్లాల్లోనూ టీకాల కార్యక్రమం జోరందుకుంటోంది. మొత్తంగా 15 జిల్లాల్లో లక్ష మందికి పైగా వ్యాక్సిన్‌ పొందటం విశేషం.

అవగాహన మంత్రంతో..

ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యఆరోగ్య సిబ్బంది కలిసికట్టుగా గ్రామీణ ప్రజల్ని టీకాలు వేసుకునేలా అవగాహన కల్పించడంతో సఫలీకృతులవుతున్నారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక వాహనాలు సమకూర్చుతున్నారు. కరీంనగర్‌, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని చాలా పీహెచ్‌సీల్లో 3వేల నుంచి 5వేలకుపైగా డోస్‌లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 45.20 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోగా.. ఇందులో 45-60 ఏళ్లవారు 20.47 లక్షల మంది ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన 14.53 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇక ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పనిచేస్తున్న వారిలో 30 ఏళ్లలోపు వాళ్లు 1.29 లక్షల మంది టీకా తీసుకున్నారు.

ఇదీ చూడండి: నగరంలో కష్టంగా మారుతున్న కరోనా మృతుల అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.