ETV Bharat / state

పత్తి రైతుకు దక్కని మద్దతు ధర - జమ్మికుంట వ్యవసాయ మార్కెట్

మార్కెట్​కు వెళ్లేంత వరకు పత్తి రైతులకు కనీసం ధర కూడ తెలియని పరిస్థితి నేటికీ ఉంది. తూకం వేసి.. గుత్తేదారు, కొనుగోలుదారు చెప్తేనే పత్తికి క్వింటాలు ధర ఎంతో తెలుస్తోందంటూ కరీంనగర్​ పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన తెల్ల బంగారాన్ని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో అమ్మడానికి తీసుకొచ్చిన పత్తికి కనీస ధర రావడం లేదంటూ.. పత్తి రైతులు బాధపడుతున్నారు.

cotton formers demands for best price for cotton
పత్తి రైతుకు దక్కని మద్దతు ధర
author img

By

Published : Oct 1, 2020, 8:39 PM IST

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతుకు.. చివరి వరకు కూడా పంట ధర తెలియటం లేదు. చేతికందిన పత్తి దిగుబడులను అమ్మటానికి రైతులు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు పత్తిపంటను తీసుకొస్తున్నారు. ఉత్తర తెలంగాణలో రెండో అతిపెద్ద మార్కెట్‌ అయిన జమ్మికుంట మార్కెట్‌లో ఇటీవల పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. పత్తి నిల్వలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, అమ్మేందుకు రైతులు మార్కెట్‌కు వస్తున్నారు. రైతులు పండించి తెచ్చిన పత్తిపంటకు వేలంపాట ద్వారా ధర నిర్ణయిస్తున్నారు. తీసుకొచ్చిన పత్తికి మంచి ధర పలుకుతుందనే రైతుల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయి. మరికొందరైతే పత్తి నిల్వలను పరిశీలించి చీటిలపై ధరల రాసి ఇస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులకు.. ఇంతే ఇస్తాం.. అని వ్యాపారులు దురుసుగా సమాధానం చెప్తున్నారు. తీసుకొచ్చిన పత్తికి కనీస ధర పలుకకపోవటం వల్ల రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పత్తిని ఏరేందుకే ఒక్కో కూలీకి రోజుకు రూ.250 వరకు చెల్లించారు. విత్తనాలు, ఎరువులు అన్ని కలిసి పండించేందుకు పెట్టిన పెట్టుబడి కూడా.. రావడం లేదు. రూ.2800 నుంచి రూ.3వేలు ధర పలికితే ఎలా గిట్టుబాటవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పండించిన తాము మోసపోయి నష్టాలు చవి చూస్తుంటే.. దళారులు, వ్యాపారులు మాత్రం లబ్ధి పొందుతున్నారని, రైతులకు ఏం దక్కడం లేదని వాపోతున్నారు.

పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

గిట్టుబాటు కావడం లేదు..
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా మారింది పత్తి రైతుల పరిస్థితి. ఎకరానికి రూ.40 నుంచి రూ.50వేల వరకు పెట్టుబడులు పెట్టారు. తీరా మార్కెట్​కు తీసుకొస్తే.. క్వింటాల్​కు ధర రూ.2700 మాత్రమే పలికిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎకరం పత్తి సాగు చేసి.. రరెండు బస్తాల పత్తిని మార్కెట్​కు తీసుకువస్తే.. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి క్వింటాల్​కు కనీసం రూ.6000 చెల్లిస్తే రైతుకు కాస్త మిగులు వస్తుంది. లాభం వచ్చే పంట వేద్దామంటే.. నియంత్రిత సాగు విధానంలో పత్తి పండించాలంటూ అధికారులు సూచించారని.. తీరా.. మార్కెట్​కు వస్తే పంటకు గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మద్దతు ధర పెంచాలి..
పత్తి ధరను పెంచేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వ్యాపారులతో మాట్లాడి.. పత్తికి చెల్లించే ధర పెంచాలని రైతులు కోరుతున్నారు. గత పదిరోజులుగా జమ్మికుంట మార్కెట్​కు పత్తి భారీగా వస్తున్నదని.. రోజుకు కనీసం 50 లారీలు మార్కెట్​కు తరలి వస్తున్నాయని క్వింటాలుకు రూ.3వేల నుంచి రూ.3700 వరకు చెల్లిస్తున్నట్టు మార్కెట్​ పర్యవేక్షకుడు యాకయ్య తెలిపారు. ఆరబెట్టిన పత్తి తీసుకువస్తే మంచి ధర వస్తుందని ఆయన రైతులకు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.