ETV Bharat / state

భర్త వస్తాడనుకుంటే.. డెత్​ సర్టిఫికెట్ ఇంటికొచ్చింది!

బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి మృతిచెందగా... అక్కడి ప్రభుత్వం మృతదేహం ఖననం చేసి డెత్​ సర్టిఫికెట్ పంపింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో చోటుచేసుకుంది.

Corona tested possitive man died in gulf
గల్ఫ్​లో వ్యక్తికి కరోనా... డెత్​ సర్టిఫికెట్​ ఇంటికి
author img

By

Published : Jun 4, 2020, 3:58 PM IST

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్​కు వలస వెళ్ళాడు. ఈ క్రమంలో రాకాసి కరోనా సోకి మరణించాడు. పెద్ద దిక్కు కోల్పోయి బాధిత కుటుంబం అతలాకుతలమైంది. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

మృతదేహాన్ని కూడా చూసుకోని దుస్థితి ఎవరికి రాకూడదు దేవుడా అంటూ... కుటుంబ సభ్యుల పెట్టిన రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. డెత్ సర్టిఫికెట్ పట్టుకొని బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమైంది. బాధితుడు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ... మే 13న మృతి చెందగా.. ప్రభుత్వమే ఖననం చేసి డెత్ సర్టిఫికెట్ ఈనెల 3న స్వగ్రామానికి పంపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.