ETV Bharat / state

కరీంనగర్​ జిల్లాలో విజృంభిస్తోన్న మహమ్మారి.. స్థానికుల్లో ఆందోళన

author img

By

Published : Jul 22, 2020, 2:07 PM IST

రోజురోజుకు మహమ్మారి శరవేగంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరిస్తోంది. కరీంనగర్​ జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో అనేక పాజిటివ్​ కేసులు రావడం స్థానికుల్లో భయాందోళనలు రేపుతుంది.

corona cases update in karimnagar district
విజృంభిస్తోన్న మహమ్మారి.. స్థానికుల్లో ఆందోళన

కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కరోనా కలకలం రేపింది. చొప్పదండి పట్టణంలో పది మందికి పాజిటివ్​ నిర్ధరణ కావటం వల్ల ప్రజలు అప్రమత్తం భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. రెండు కుటుంబాల్లో ఎనిమిది మంది, మరో ఇద్దరికి వైరస్​ సోకినట్టు అధికారులు వెల్లడించారు. దీనితో హోటళ్లు, ఇతర దుకాణాలు వారం రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేశారు. రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంటిజెన్ విధానంలో కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు మొదలు పెట్టారు. తొలి రోజున 19 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారించారు.

ఒకరిని శాతవాహన ఐసొలేశన్ కేంద్రానికి తరలించగా మరొకరిని హోం క్వారంటెన్ చేసి చికిత్స అందిస్తున్నారు. వెదిర గ్రామం నుంచి పాజిటివ్ వ్యక్తిని కరీంనగర్ ప్రధానాస్పత్రికి తరలించారు. లక్ష్మీపూర్ నుంచి మరో పాజటివ్ వ్యక్తిని కరీంనగర్​లో చికిత్సకు తరలించారు. గంగాధర మండలం మధురానగర్​లో నలుగురికి పాజిటివ్​గా​ నిర్ధరించి చికిత్స అందిస్తున్నారు. గర్షకుర్తికి చెందిన వైరస్​ బాధితుడు కరీంనగర్​లో చికిత్స పొందుతూ మరణించారు. అతని కుటుంబ సభ్యులు హోం క్వారంటెన్​లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.