ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి సంక్రమణ క్రమంగా తగ్గుతుండటం వల్ల కఠిన ఆంక్షలను అధికారులు ఉపసంహరిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 27గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఐదుకు తగ్గిపోవటం వల్ల 13చోట్ల కంటైన్మెంట్ జోన్లను ఉపసంహరించారు.
కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఒకరు మాత్రమే చికిత్స పొందుతుండగా... సాహెత్‌నగర్, శర్మనగర్‌లను మాత్రమే కంటైన్మెంట్ జోన్‌గా కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న రెండు పాజిటివ్ కేసులు నెగిటివ్ రావటమే కాకుండా కొత్త కేసులేమీ నమోదు కాకపోవటం వల్ల జీఎం కాలనీ, అన్నపూర్ణ కాలనీలో ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాలను ఉపసంహరించారు.
జగిత్యాల జిల్లాలో 3 పాజిటివ్ కేసులకు గాను ఒక్కరే మిగిలి ఉన్నారు. దీనితో కోరుట్ల, కల్లూరులో అమల్లో ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాలను ఉపసంహరించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో 3 పాజిటివ్ కేసులు ఉండటం వల్ల సుభాష్‌నగర్‌ను మాత్రం కంటైన్మెంట్ జోన్‌గా కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి:'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'