కరీంనగర్లోని పోచమ్మ వాడలో సీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 71 ద్విచక్రవాహనాలను, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో మొత్తం 150 మంది పోలీసులు పాల్గొన్నట్లు సీపీ వెల్లడించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కాలనీవాసులను కోరారు.
ఇవీ చూడండి: 'మతాచారాలను నియంత్రించే అధికారం చట్టానికుంది'