ETV Bharat / state

రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల ఘర్షణ - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రచ్చబండ కార్యక్రమాన్ని తెరాస కార్యకర్తలు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్‌ రైతు రచ్చబండ కార్యక్రమం
కాంగ్రెస్‌ రైతు రచ్చబండ కార్యక్రమం
author img

By

Published : May 21, 2022, 3:50 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపుర్‌ మండలం మెుగిలిపాలెంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రచ్చబండ కార్యక్రమంను జరగకుండా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు తొపులాట జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకొవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామగ్రామానికి, గడప గడపకు రైతు డిక్లరేషన్ అనే నినాదంతో దాదాపు 400 మంది నాయకులు ముందుకెళ్తున్నారు. నెలరోజుల్లో రాష్ట్రంలోని అన్నిగడపలకు డిక్లరేషన్ చేరేలా ఇప్పటికే పెద్దఎత్తున కరపత్రాలు, ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్ల పంపిణీకి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇదీ చదవండి: వరంగల్​ డిక్లరేషన్​ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్​ రైతు రచ్చబండ

'భారత- చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్​ లాంటి పరిస్థితులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.