చెరువును నింపడమే కాదు చెరువు నుంచి కాలువలు కూడా నిర్మించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ చెరువు కుడి కాలువ నిర్మాణం పూర్తి చేస్తే ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్రపటానికి తానే స్వయంగా పాలాభిషేకం చేస్తానని చెప్పారు. ఓ వైపు సాగు నీరు లేక రైతుల వరి నార్లు ముదిరిపోతుంటే మరోవైపు ఎమ్మెల్యే రాజకీయ లబ్ధి పొందాలని చూడటం శోచనీయమన్నారు.
చొప్పదండి నియోజకవర్గం మరో కోనసీమగా మారిందని ఎమ్మెల్యే పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నారాయణపూర్ చెరువు కుడి, ఎడమ కాలువలు నిర్మించి 50,000 ఎకరాలకు నీరు అందించే ప్రణాళిక రూపొందించామని చెప్పారు. నారాయణపూర్ చెరువులో భూ నిర్వాసితులైన మూడు గ్రామాల ప్రజలకు పరిహారం మంజూరు చేయాలని కోరారు. రూ.248కోట్లతో శంకుస్థాపన చేసిన మోతే కాలువల నిర్మాణం ఇప్పటికీ మొదలు పెట్టలేదని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు