మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనం బయటపడిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మన్వాడ వద్ద నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలిసి పొన్నం పరిశీలించారు. 25 టీఎంసీల సామర్థ్యం ఉన్నా.. కేవలం 15 టీఎంసీల నీటినే నిల్వచేశారన్నారు. నాణ్యత లోపాలు బయటపడడం వల్ల రాత్రికిరాత్రే 25 గేట్లు ఎత్తి నీటిని కిందకి విడిచిపెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్న పొన్నం... ఇందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరకట్టను మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదల...