రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా హస్తం పార్టీని బలోపేతం చేసేందుకు 'కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ'ను నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని శాస్త్రీ రోడ్లో మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అంతర్గత విభేదాలు మరిచిపోయి పార్టీ పటిష్ఠత కోసం పనిచేయాలని కోరారు. ఐదేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం కరీంనగర్ నగర అభివృద్ధికి చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ