హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో(huzurabad by election) తెరాస పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్నికల కమిషనర్‌కు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి లేఖ రాశారు. మంత్రి హరీష్‌రావు గత నెలరోజులుగా ఆ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆ లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతోందని ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌కు కోదండ రెడ్డి ఫిర్యాదు(congress complaint to ec) చేశారు.
ఎన్నికల ప్రక్రియను మంత్రి హోదాలో ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్న కోదండ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రచారం చేసుకోవచ్చని సూచించారు. ఆలా కాకుండా మంత్రి పదవిలో ఉంటూ.. ప్రోటోకాల్ పాటిస్తూ ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. సీనియర్ మంత్రిగా అందరికి తెలిసిన వ్యక్తి కావడంతో ఆ ప్రభావం ఎన్నికల ప్రక్రియ మీద పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన ఆ నియోజక వర్గంలో ప్రచారం నుంచి బయటకు వచ్చేట్లు ఎన్నికల కమిషన్(election commission) చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనాలని కోదండ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Huzurabad by election campaign: ప్రచారానికి పది రోజులే గడువు.. హోరెత్తుతున్న పార్టీల జోరు!