హుజూరాబాద్ ఉపఎన్నికపై(Huzurabad by elections 2021Huzurabad by elections 2021) కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మండలాల ఇంఛార్జీలు, సమన్వయకర్తలను పీసీసీ నియమించింది. కమలాపురం మండలం ఇంఛార్జీగా ఎమ్మెల్యే సీతక్క, ముఖ్య సమన్వయకర్తగా వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిలను నియమించింది. హుజూరాబాద్ మండల ఇంఛార్జీగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ముఖ్య సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వ్యవహరిస్తారని తెలిపింది.
ఇంఛార్జీల నియామకం
జమ్మికుంట మండల ఇంఛార్జీగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ముఖ్య సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు నియమితులయ్యారు. ఇల్లంతకుంట మండలం ఇంఛార్జీగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ముఖ్య సమన్వయకర్తగా జనగాం డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డిలను నియమించింది. వీణవంక మండలం ఇంఛార్జీగా ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ముఖ్య సమన్వయకర్తగా ఆది శ్రీనివాస్‌ను నియమించినట్లు వివరించింది.
నామినేషన్లు దాఖలు
హుజూరాబాద్ ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి బల్మూరి వెంకట్ శుక్రవారం నామినేషన్(huzurabad congress candidate balmuri venkat) వేశారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో అదేరోజున నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఈనెల 30 న జరగనుంది.
ఉపఎన్నిక వివరాలిలా...
ఈ నెల 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: Huzurabad by election 2021: విద్యార్థి, నిరుద్యోగుల గొంతుకనై పోరాడుతా..