కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ తండాలోని విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి సైదాపూర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కొత్త తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే సహకార సంఘం సభ్యులకు, ఐకేపి మహిళా సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి తోసుకునే వరకు వచ్చింది.
ఇదీ కారణం
తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో కాకుండా విశాల సహకార పరపతి సంఘంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ఏంటని ఐకేపీ మహిళలు వాగ్వాదానికి దిగారు. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువురిని వారించి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చూడండి: అభివృద్ధి అంటే రంగులు వేయడం కాదు: భట్టి