ETV Bharat / state

CM KCR review: హుజూరాబాద్​లో ఏం జరుగుతోంది..? - హుజూరాబాద్​ ఉప ఎన్నికపై తెరాస సమీక్ష

CM KCR: హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Aug 20, 2021, 6:38 PM IST

Updated : Aug 21, 2021, 5:25 AM IST

18:36 August 20

హుజూరాబాద్​లో ఏం జరుగుతోంది..?

హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఉపఎన్నికపై మంత్రులు, నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్​ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సహా ఇతర నేతలతో ముఖ్యమంత్రి ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాక పరిస్థితులు, దళితబంధు పథకం ప్రారంభసభ తర్వాత ప్రజల్లో స్పందన తదితర అంశాలపై మంత్రులు, నేతలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో మంచి స్పందన ఉందని, పార్టీకి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని నేతలతో సీఎం అన్నట్లు సమాచారం. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని... ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వల్ల లబ్ది తదితరాలను వివరించాలని సూచించినట్లు తెలిసింది. ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి గెలుపు ఆవశ్యకతను ప్రజలకు బాగా వివరించాలని నేతలకు సీఎం చెప్పినట్లు సమాచారం.   

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (EX- Minister Etela Rajender) రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైన హుజూరాబాద్‌లో అభ్యర్థి కోసం అధికార తెరాస ముమ్మర కసరత్తు చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ (CM KCR) నిర్ణయంతో వీణవంక మండలం, హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌ను (gellu srinivas yadav) ఖరారు చేశారు. ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస అధిష్ఠానం... తమ అభ్యర్థి గెలుపు దిశగా అన్ని విధాల ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ పెద్దలు ఒక్కొక్కరిగా హుజూరాబాద్​లో పర్యటిస్తున్నారు.  

 ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్

 హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం క్షేత్రస్థాయిలో తెరాస ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కీలక నేతలు, మంత్రులు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ప్రకటించిన దృష్ట్యా ఈ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. దళితబంధు అమలు తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు ఒక్కసారిగా మారాయనే చెప్పవచ్చు. మరోవైపు భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రతో ప్రజలకు చేరువ అవుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఏ చిన్న కార్యక్రమం జరిగినా హాజరవుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.  

ఇదీ చూడండి: Huzurabad by election : హుజూరాబాద్​లో ఊహకందని పోరు.. ప్రచారంలో వాక్బాణాల హోరు

Last Updated : Aug 21, 2021, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.