ETV Bharat / state

CM KCR: ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు.. కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్

సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన దళితబంధు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఉద్యోగుల కుటుంబాలకూ లబ్ధి చేకూరనుంది. నాలుగేళ్లలో దళిత బంధు పథకంతో అద్భుత ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వం పథకం కింద మాత్రమే మిగిలిపోకూడదని.. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలని సీఎం స్పష్టం చేశారు.

cm-kcr-launched-dalit-bandhu-officially-at-huzurabad

author img

By

Published : Aug 16, 2021, 3:19 PM IST

Updated : Aug 16, 2021, 10:32 PM IST

నాలుగేళ్లలో దళిత బంధు పథకంతో అద్భుత ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వం పథకం కింద మాత్రమే మిగిలిపోకూడదని.. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలని సీఎం స్పష్టం చేశారు.

దళితబంధు ఒక ఉద్యమంగా సాగాలి..

తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన సభ కరీంనగర్‌లోనే జరిగిందని సీఎం కేసీఆర్​ అన్నారు. శాలపల్లి నుంచే రైతుబంధు ప్రారంభించానని.. ఆ పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. కరీంనగర్‌లోనే రైతుబీమా ప్రారంభించానని గుర్తుచేశారు. అద్భుతమైన మరో ఉద్యమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుడుతున్నామని సీఎం చెప్పారు. దళితబంధు ఒక ఉద్యమంగా సాగాలని.. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలని సీఎం స్పష్టం చేశారు. నాలుగేళ్లలో దళితబంధు పథకంతో అద్భుత ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండు నెలల్లో హుజూరాబాద్​లో అందరికి దళిత బంధు డబ్బులిస్తామని చెప్పారు.

ఇతర పార్టీలకు రాజకీయం ఒక క్రీడ..

తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిననాడు.. ఎన్నో అపోహలు, అనుమానాలు తలెత్తినట్లు చెప్పారు. అవన్నీ దాటుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్లు గుర్తుచేశారు. ఇది కేవలం ప్రభుత్వం పథకం కింద మాత్రమే మిగిలిపోకూడదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించామని.. ఇతర పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడని. తెరాసకు మాత్రం అదో పవిత్ర కార్యమన్నారు.

అన్నింటా రిజర్వేషన్​..

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. లైసెన్సింగ్‌ దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తామని వెల్లడించారు. ఎరువుల దుకాణాలు, మందుల దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ధనిక పారిశ్రామికవేత్తల మాదిరిగానే ఎస్సీలు కూడా వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. దళిత బంధు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని సీఎం తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ దళిత బంధుపై చర్చ జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే ఇదో మహోన్నత ఉద్యమం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశానికే ఆదర్శం..

రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని.. గవర్నమెంట్‌ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకూ దళితబంధు అమలుచేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చివరి వరుసలో దళితబంధు ఇస్తామని.. ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా నిధులిస్తామని కేసీఆర్​ వెల్లడించారు. హుజూరాబాద్ ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ.2 వేల కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

'దళితబంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చు. డబ్బు 100 శాతం సబ్సిడీతో ఇస్తాం. దళితబంధు నిధులకు కిస్తీల కిరికిరి లేదు. నచ్చిన స్వయం ఉపాధి పనులు, వ్యాపారాలు చేసుకోవచ్చు. రూ.10 లక్షలతో వచ్చే ఏడాదికల్లా రూ.20 లక్షలు సంపాదించుకోవాలి.'

- ముఖ్యమంత్రి కేసీఆర్​

ప్రతి ఎస్సీ కుటుంబానికి డబ్బులిస్తాం..

ఏడాది క్రితమే దళితబంధు ప్రారంభించాలని అనుకున్నానని కేసీఆర్​ అన్నారు. కరోనా వల్ల పథకం ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉందన్నారు. నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తామని.. హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని.. ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.

25 ఏళ్ల క్రితం నుంచే ఎస్సీల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నానన్న సీఎం.. ఎస్సీల కోసం నా మస్తిష్కంలో ఎన్నో పథకాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌, భాజపా ప్రధానులు ఇలాంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన కేసీఆర్​.. ఇప్పటివరకు ఆలోచన చేయని నేతలు ఇవాళ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

'దళితబంధు నిధుల ఖర్చుపై ప్రభుత్వ సమీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు కమిటీలు వేస్తాం. 1.25 లక్ష మంది ప్రజాప్రతినిధులు దళితబంధును సమీక్షిస్తారు. రూ.25 వేల కోట్లతో దళితబంధు రక్షణనిధి ఏర్పాటు చేస్తాం. దళితులు బాగుపడనంత కాలం సమాజం బాగుపడదు. సమాజంలో ఒకభాగం కునారిల్లుతుంటే అందరం క్షేమంగా ఉండలేం. దళితులు పెట్టుబడిదారులైతేనే రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధ్యం. నేను తెచ్చిన పథకాలను రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేయలేరు. నా మెదడు కరగబెట్టి దళిత బంధుకు రూపకల్పన చేశాను.'

- సీఎం కేసీఆర్​

CM KCR : హుజూరాబాద్​లోని ప్రతీ ఎస్సీ కుటుంబానికి రెండునెలల్లో 'దళితబంధు'

ఇదీచూడండి: CM KCR: ప్రభుత్వ కాంట్రాక్టులతోపాటు ప్రతీ వ్యాపారంలో ఎస్సీలకు రిజర్వేషన్‌: సీఎం

Last Updated : Aug 16, 2021, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.