కరీంగనర్ జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద సీఐటీయూ, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన భాజపా ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్‌ను ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేస్తూ.. ధర్నా నిర్వహించారు.
పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సీఐటీయూ ధర్నా - సీఐటీయూ
పెట్రోల్, డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద సీఐటీయూ, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ పరిధిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.