ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా యాక్టివ్ కేసులు నాలుగుకు తగ్గిపోయాయి. ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఒకటి చొప్పున, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లిలో కంటైన్మెంట్ జోన్ కొనసాగుతోంది. వైరస్ విజృంభన తగ్గడం వల్ల లాక్డౌన్ నిబంధనలను సడలించి అమలు చేస్తున్నారు.
సరి, బేసి సంఖ్య విధానంతో షాపులు తెరుచుకోవడానికే అనుమతిస్తున్నారు. నిబంధనలు సడలింపు వల్ల వ్యాపార స్థితి గతులపై చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కరీంనగర్ పట్టణం నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ వివరాలు అందిస్తారు.