ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని వారి మెడల్లోని పుస్తెలతాడులను చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను రామడుగు పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూలి పనులతో ఆదాయం తక్కువ అని గ్రహించి ఈజీమనీకి అలవాటు పడ్డారు.
ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని గత సంవత్సర కాలంలో వారి మెడల్లోని పుస్తెలతాళ్లు దొంగలించసాగారు. రామడుగు మండలంలోని కిష్టంపల్లి వెంకట్రావు పల్లి గ్రామాల్లోనూ ఇదే తరహాలో పుస్తెలతాళ్లను లాక్కెళ్లారు. అయితే చోరీ సొత్తును విక్రయించే క్రమంలో పోలీసులు సోదాలు చేస్తుండగా దొరికిపోయారు.
ఇదీ చదవండి : ప్రగతి భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్