కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల జడ్పీ ఉన్నత పాఠశాల అన్ని సౌకర్యాలతో విద్యార్థులను ఆకర్షిస్తోంది. 1950లో పూరిపాకలో మొదలుపెట్టిన పాఠశాల నేడు పక్కా భవనాలు, ప్రహరి గోడ, విద్యార్థులకు శౌచాలయం, పాఠశాల ఆవరణలో రకరకాల మొక్కలతో పాటు క్రీడామైదానం, డిజిటల్ క్లాస్ రూమ్ సౌకర్యాలు కలిగి ప్రైవేట్ పాఠశాలను తలపిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యాలు కల్పిస్తోంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటుంది ఈ ప్రభుత్వ పాఠశాల.
ఇవీ చూడండి: చత్తీస్గఢ్లో ఇద్దరు నక్సల్స్ హతం