ETV Bharat / state

ఫలించిన సంజయ్​ కృషి.. ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు మోక్షం - bandi sanjay latest news

Elkathurthi-Siddipet road widening works: ఎల్కతుర్తి – సిద్దిపేట రోడ్డు విస్తరణ పనుల కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతికపరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఫలించిన సంజయ్​ కృషి.. ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు మోక్షం

author img

By

Published : Jan 20, 2022, 6:58 PM IST

Elkathurthi-Siddipet road widening works: ఎల్కతుర్తి – సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లభించింది. రోడ్డు విస్తరణ పనుల కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతికపరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఎన్​హెచ్-765 డి.జి పరిధిలోని ఎల్కతుర్తి-సిద్దిపేట విస్తరణ పనుల్లో భాగంగా మొత్తం 63.641 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరిపాలనాపరమైన పనులకు ఆమోదం తెలపడంతో ఇక పనులు మొదలు కావడమే మిగిలి ఉంది.

పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి

ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు మేజర్ బ్రిడ్జిలను, 6 మైనర్ బ్రిడ్జిలను పునర్ నిర్మించనున్నారు. వీటితోపాటు కొత్తగా 1 మేజర్, 26 మైనర్ బ్రిడ్జీలను కూడా నిర్మించనున్నారు. వాస్తవానికి ఎల్కతుర్తి- సిద్దిపేట విస్తరణ పనులు చేపట్టాలంటూ బండి సంజయ్ కుమార్ గత కొన్ని నెలలుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగా పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎల్కతుర్తి – సిద్ధిపేట విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

పనుల మంజూరే నిదర్శనం

తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందనడానికి ఎల్కతుర్తి- సిద్దిపేట రోడ్డు విస్తరణ పనుల మంజూరే నిదర్శనమని బండి సంజయ్​ అన్నారు. రోడ్డు విస్తరణ పనులు తొందరగా పూర్తయితే కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాల ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగడమే కాకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.