ETV Bharat / state

అతివేగంతో కారు బోల్తా... వ్యక్తి దుర్మరణం

అతివేగంతో అదుపుతప్పి పొదల్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రేణిగుంట వద్ద రాజీవ్​ రహదారిపై జరిగింది.

అతివేగంతో కారు బోల్తా... వ్యక్తి దుర్మరణం
author img

By

Published : Sep 19, 2019, 5:16 PM IST

కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట ఎల్లమ్మ టెంపుల్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్​ రహదారిపై చీలాపూర్​ నుంచి కరీంనగర్​ వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు చీలాపూర్​కు చెందిన ప్రశాంత్​గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు క్రేన్​తో పొదల్లోంచి కారును బయటకు తీశారు. అతివేగంతో ఎన్నో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని, భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అతివేగంతో కారు బోల్తా... వ్యక్తి దుర్మరణం

ఇదీ చూడండి: వినూత్న పథకాలతో గ్రామీణాభివృద్ధి సాధించాలి: గవర్నర్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.