R.S.PRAVEEN KUMAR: తెలంగాణలో బహుజన సమాజం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సహకరించాలని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే అల్గునూర్ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టగా.. ప్రవీణ్‌కుమార్ రోడ్‌షోలో నగర ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించిన బీసీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో అధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గం.. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న వారికి వంత పాడుతున్నారని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది ఇంతటితో ఆపాలని ఆయన కోరారు. బహుజన సమాజంలో అన్ని మతాలకు, కులాలకు న్యాయం జరిగేలా పాలన ఉంటుందని, ప్రజలు గమనించి బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: R.S.PRAVEEN KUMAR: త్యాగాలు ఒకరివి.. భోగాలు మరొకరివి: ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్